Delhi: ఢిల్లీ ఎయిర్ పోర్ట్ గేట్ వద్ద మాదకద్రవ్యాల కవర్ లభ్యం!

Drugs found in cover near Delhi airport gate
  • గేట్ నెంబర్ 11 వద్ద కవర్ వదిలేసి వెళ్లిన స్మగ్లర్లు
  • 51 క్యాప్స్యూల్స్ లో కొకైన్ ను గుర్తించిన కస్టమ్స్ అధికారులు
  • దీని విలువ రూ 15 కోట్లు ఉంటుందని అంచనా 
ఢిల్లీ ఎయిర్ పోర్టులో అరుదైన ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయం గేట్ నెంబర్ 11 వద్ద ఓ కవర్ ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దాన్ని తెరిచి చూడగా అందులో 51 క్యాప్స్యూల్స్ లో కొకైన్ ను గుర్తించారు. దీని విలువ రూ. 15 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎయిర్ పోర్టులో డ్రగ్స్ పట్టుబడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కస్టమ్స్ అధికారుల కదలికలను గుర్తించిన స్మగ్లర్లు డ్రగ్స్ ఉన్న కవర్ ను గేట్ వద్ద వదిలేసి పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కవర్ ఎవరు తెచ్చారు? వారు ఏ దేశం నుంచి వచ్చారు? అనే విషయంపై దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
Delhi
Airport
Drugs

More Telugu News