New Judges: నేడు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు జడ్జిల ప్రమాణం

Seven judges will take oath in AP High Court
  • ఇటీవల సుప్రీం కొలీజియం సిఫారసు
  • ఆమోదించిన రాష్ట్రపతి
  • కొత్త జడ్జిలతో ప్రమాణం చేయించనున్న హైకోర్టు సీజే
  • ఏపీ హైకోర్టులో 27కి పెరిగిన జడ్జిల సంఖ్య

ఏపీ హైకోర్టులో జడ్జిలుగా నేడు ఏడుగురు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టులో ఈ ఉదయం 10.30 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. జస్టిస్ రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ సుజాత, జస్టిస్ రవి, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ రాజశేఖర్ రావు, జస్టిస్ వెంకటేశ్వర్లు జడ్జిలుగా ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నూతన న్యాయమూర్తులతో ప్రమాణం చేయించనున్నారు.

ఇటీవలే సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులను సిఫారసు చేయగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. తాజా నియామకాలతో ఏపీ హైకోర్టులో జడ్జిల సంఖ్య 27కి పెరిగింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాలి.

  • Loading...

More Telugu News