Chiranjeevi: సతీ సమేతంగా సమతామూర్తిని దర్శించుకున్న చిరంజీవి.. ఫొటోలు ఇవిగో!

Chiranjeevi went to muchinthal
  • చిరంజీవి దంపతులకు ఆశీర్వచనాలు పలికిన చినజీయర్ స్వామి
  • సమతామూర్తి ప్రతిమ బహూకరణ
  • ఈరోజు హైదరాబాదుకు రానున్న రాష్ట్రపతి
ముచ్చింతల్ లోని సమతామూర్తి సన్నిధిని మెగాస్టార్ చిరంజీవి దర్శించుకున్నారు. తన సతీమణి సురేఖతో కలిసి ముచ్చింతల్ కు వెళ్లారు. ఆశ్రమానికి విచ్చేసిన చిరంజీవి దంపతులకు చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు పలికారు. సమతామూర్తి ప్రతిమను చిరంజీవికి అందించారు. ఇప్పటికే చిరంజీవి సోదరుడు, జనసేనాని పవన్ కల్యాణ్ సమతామూర్తిని దర్శించుకున్నారు. మరోవైపు ఈరోజు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమతామూర్తిని దర్శించుకోవడానికి హైదరాబాద్ విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా 120 కేజీల శ్రీరామానుజ బంగారు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.
Chiranjeevi
Tollywood
Chinna Jeeyar Swamy

More Telugu News