KTR: 'నాపై ఏపీ సోదరులు చాలా ప్రేమ కురిపించారు'.. బొత్స కుమారుడి పెళ్లిలో తీసిన‌ వీడియోను పోస్ట్ చేసిన కేటీఆర్

KTR says  overwhelmed with the love from my brothers from AP
  • నిన్న పెళ్లికి వెళ్లాను
  • ఏపీ సోద‌రుల‌ ప్రేమ ప‌ట్ల నా హృదయం ఉప్పొంగిపోయింది
  • భౌగోళిక ప‌రంగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయాయి
  • ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య‌ ప్రేమానురాగాలు అలాగే  కొన‌సాగుతున్నాయన్న మంత్రి 
హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో ఏపీ మంత్రి బొత్స కుమారుడి వివాహం నిన్న జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు హాజరైన తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇందుకు సంబంధించిన వీడియోను ఈ రోజు పోస్ట్ చేశారు. పెళ్లిలో త‌న‌తో అంద‌రూ ప్రేమ‌తో మాట్లాడార‌ని చెప్పారు.

'నిన్న ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ గారి కొడుకు పెళ్లికి వెళ్లాను. ఏపీకి చెందిన‌ నా సోదరులు చూపిన ప్రేమ ప‌ట్ల నా హృదయం ఉప్పొంగిపోయింది. భౌగోళిక ప‌రంగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన‌ప్ప‌టికీ ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య‌ ప్రేమానురాగాలు మాత్రం అలాగే కొన‌సాగుతున్నాయి' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
KTR
Telangana
Andhra Pradesh
Botsa

More Telugu News