Prabhas: పునీత్ రాజ్ కుమార్ ను ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్ చేసిన ప్రభాస్

Prabhas emotional post on Puneet Rajkumar

  • మార్చ్ 17న విడుదల కాబోతున్న పునీత్ చివరి చిత్రం
  • అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నామన్న ప్రభాస్
  • వీ మిస్ యూ సర్ అంటూ భావోద్వేగం

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' విడుదల కాబోతోంది. మార్చ్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ ను నిన్న విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పునీత్ ను తలచుకుంటూ ప్రభాస్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

''జేమ్స్' రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్ ని అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. వీ మిస్ యూ సర్' అని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' చిత్రం మార్చి 11న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News