ఇద్దరు 9వ తరగతి బాలికల అదృశ్యం
- కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
- సిర్పూర్.టి లోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుతోన్న విద్యార్థినులు
- గత రాత్రి ఇద్దరూ కలిసి వసతి గృహం నుంచి బయటకు
- తిరిగి రాకపోవడంతో పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
ఆ విద్యార్థినులు తమ ఇళ్లకు కూడా వెళ్లలేదని వసతి గృహం సిబ్బంది తెలుసుకున్నారు. వసతి గృహం నుంచి సమాచారం అందడంతో కంగారు పడ్డ ఆ విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బాలికల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలనూ పరిశీలిస్తున్నారు.