AP Pavilion: దుబాయ్ ఎక్స్ పోలో ఏపీ పెవిలియన్ ప్రారంభించిన మంత్రి మేకపాటి

Minister Mekapati launches AP Pavilion in Dubai Expo
  • దుబాయ్ లో ఎక్స్ పో-2020
  • ఇండియన్ పెవిలియన్ భవనంలో ఏపీ పెవిలియన్ ఏర్పాటు
  • ప్రారంభోత్సవానికి విచ్చేసిన యూఏఈ మంత్రి
ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో దుబాయ్ లో ప్రారంభమైన ఎక్స్ పో-2020లో ఏపీ పెవిలియన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఏపీ పెవిలియన్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేడు ప్రారంభించారు. దుబాయ్ లోని ఇండియన్ పెవిలియన్ భవంతిలో ఏపీ పెవిలియన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యూఏఈ విదేశాంగ మంత్రి కూడా హాజరయ్యారు. ఏపీలో పెట్టుబడులు, ప్రాజెక్టులకు సంబంధించిన పుస్తకాన్ని యూఏఈ మంత్రి ఆవిష్కరించారు.

కాగా, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా ఏపీ పెవిలియన్ ను తీర్చిదిద్దారు. ఏపీలో పెట్టుబడులు, సానుకూలాంశాలపై ఈ పెవిలియన్ ద్వారా అవగాహన కలిగించనున్నారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ పార్కులు, ఫిషింగ్ హార్బర్ల వీడియోలను, విద్య, వైద్య, టూరిజం, ఐటీ, పోర్టులపై వీడియోలను పెవిలియన్ లో ప్రదర్శిస్తారు. ఏపీలో మౌలిక సదుపాయాలు, ఎగుమతి అవకాశాలపై వివరణ కోసం 12 స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
AP Pavilion
Dubai Expo-2020
UAE
Andhra Pradesh

More Telugu News