Shreyas Iyer: సత్తా చాటిన అయ్యర్... టీమిండియా 265 ఆలౌట్

Shreyas Iyer hits another valuable knock
  • అహ్మదాబాద్ లో మూడో వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • అయ్యర్, పంత్ అర్ధసెంచరీలు
  • రాణించిన సుందర్, చహర్

అహ్మదాబాద్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ లో శ్రేయాస్ అయ్యర్ మరోసారి ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా ఆరంభంలోనే 3 వికెట్లు చేజార్చుకోగా... రిషబ్ పంత్ (56)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దిన అయ్యర్, జట్టును సురక్షితమైన స్థితిలో నిలిపాడు. అయ్యర్ 111 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (6) విఫలం కాగా, వాషింగ్టన్ సుందర్ (33), దీపక్ చహర్ (38) ధాటిగా ఆడారు.

ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులు చేయగా, ఓపెనర్ ధావన్ 10 పరుగులు చేసి నిరాశపరిచాడు. మాజీ కెప్టెన్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 4 వికెట్లు తీయగా, అల్జారీ జోసెఫ్ 2, హేడెన్ వాల్ష్ 2 వికెట్లు పడగొట్టారు. ఓడియన్ స్మిత్, ఫాబియెన్ అలెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News