Kajal Aggarwal: కాజల్ పై బాడీ షేమింగ్.. అండగా నిలిచిన సమంత, మంచు లక్ష్మి

Samantha supports Kajal Aggarwal who faced body shaming
  • గర్భవతి కావడంతో బొద్దుగా మారిపోయిన కాజల్
  • బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్న ఆకతాయిలు
  • నీవెప్పుడూ అందంగానే ఉంటావన్న సమంత
టాలీవుడ్ చందమామగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన కుటుంబ జీవితాన్ని హాయిగా గడుపుతోంది. 2020లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని ఆమె పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. బేబీ బంప్ తో ఉన్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఆమె తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. గర్భవతి కావడంతో ఆమె బొద్దుగా కూడా మారిపోయింది. ప్రస్తుతం భర్తతో కలిసి దుబాయ్ లో ఉన్న ఆమె... అక్కడి నుంచి ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది.

అయితే కొందరు ఆకతాయిలు మాత్రం నీచమైన కామెంట్లతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమెను బాడీ షేమ్ చేస్తున్నారు. దీనిపై కాజల్ స్పందిస్తూ... తనపై బాడీ షేమింగ్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పింది. తన జీవితంలో, తన శరీరంలో కలుగుతున్న మార్పులను తాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. గర్భవతి అయిన తర్వాత శరీరంలో హర్మోనుల వల్ల కొన్ని మార్పులు జరుగుతాయని... మన శరీరం తల్లి అయ్యేందుకు అనుగుణంగా మారుతుంటుందని చెప్పింది. ఫలితంగా బరువు పెరగడం కూడా సహజమేనని తెలిపింది.

మరోవైపు కాజల్ కు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. సమంత స్పందిస్తూ నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావ్ అని కాజల్ కు అండగా నిలిచింది. మంచు లక్ష్మి స్పందిస్తూ... నువ్వు ప్రతి దశలో పర్ఫెక్ట్ గా ఉన్నావని, నీ చుట్టూ ఎంతో ప్రేమ ఉందని చెప్పింది. రాశి ఖన్నా కూడా కాజల్ కు మద్దతుగా నిలిచింది.
Kajal Aggarwal
Body Shame
Samantha
Manchu Lakshmi
Tollywood

More Telugu News