US inflation: నిత్యావసరాల ధరల పెరుగుదలతో సలసలమంటున్న అమెరికా.. 40 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం

US inflation jumped in the past year 40 year high
  • జనవరిలో 7.5 శాతానికి చేరిక
  • 1982 ఫిబ్రవరి తర్వాత అత్యధికం
  • బలంగా వినియోగ డిమాండ్

అమెరికా ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయిన ధరల కాకతో ఉడికిపోతోంది. నిత్యావసరాల ధరల పెరగుదల ఫలితంగా ద్రవ్యోల్బణం జనవరి నెలలో 7.5 శాతానికి చేరింది. గడిచిన ఏడాది కాలంలో ఈ స్థాయికి పెరగడం గమనార్హం. 1982 ఫిబ్రవరి తర్వాత ఒక ఏడాదిలో ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి.

12 నెలల క్రితంతో పోలిస్తే 2022 జనవరిలో ద్రవ్యోల్బణం 7.5 శాతానికి పెరిగినట్టు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. సరఫరా, కార్మికుల కొరత, కరోనా ప్రతికూలతల నుంచి బయటపడేసేందుకు ఫెడరల్ రిజర్వ్ పెద్ద ఎత్తున వ్యవస్థలోకి నిధులను జొప్పించడం, వినియోగ డిమాండ్ గరిష్ఠాలను చేరుకోవడం రెక్కలు విప్పుకునేలా చేశాయి.

ధరలు పెరగడం వల్ల అమెరికన్లు నిత్యావసరాలైన ఆహారం, గ్యాస్, పిల్లల సంరక్షణ కోసం వెచ్చించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది అధికారంలో ఉన్న జో డైబెన్ కు క్లిష్టమైన పరిస్థితే.

  • Loading...

More Telugu News