Chiranjeevi: ఇంకా ఎవరు వస్తారో తెలీదు.. చూద్దాం: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ వద్ద‌ చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

chiranjeevi to meets jagan
  • కాసేప‌ట్లో జ‌గ‌న్‌తో టాలీవుడ్ ప్ర‌ముఖ‌ల భేటీ
  • తనకు ఏపీ సీఎంఓ నుంచి ఆహ్వానం అందిందన్న చిరు
  • సమస్యలకు శుభం కార్డు పడుతుందని ఆశాభావం ‌
  • ఇప్ప‌టికే విజ‌య‌వాడ చేరుకున్న‌ అలీ, పోసాని, ఆర్.నారాయణ మూర్తి
తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో ఉన్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌తో సినీ ప్ర‌ముఖులు కాసేప‌ట్లో భేటీ కానున్నారు. ఈ నేప‌థ్యంలో చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్‌బాబు, త‌దిత‌రులు హైద‌రాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు చేరుకుని, ఏపీకి వెళ్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తనకు ఏపీ సీఎంఓ నుంచి ఆహ్వానం అందిందని ఆయ‌న చెప్పారు. ఈ స‌మావేశానికి ఇంకా ఎవరు వస్తారో త‌న‌కు తెలియ‌ద‌ని, చూద్దామ‌ని ఆయ‌న అన్నారు. నేటితో సినీ ప‌రిశ్ర‌మ‌ సమస్యలకు శుభం కార్డు పడుతుందని చెప్పారు. కాగా, ఇప్ప‌టికే సినీ న‌టులు అలీ, పోసాని కృష్ణ మురళీ, ఆర్.నారాయణ మూర్తి విజయవాడ చేరుకున్నారు.
Chiranjeevi
Tollywood
Jagan

More Telugu News