Vishnu Vardhan Reddy: ఇదేం భాష... మంత్రి సీదిరి అప్పలరాజును వెంటనే తొలగించాలి: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy demands remove minister Seediri Appalaraju
  • విశాఖ శారదా పీఠం వద్ద ఘటన
  • పోలీసులతో మంత్రి సీదిరి అప్పలరాజు వాగ్యుద్ధం
  • ఓ అధికారిపై బూతుల ప్రయోగం
  • వీడియో పంచుకున్న విష్ణువర్ధన్ రెడ్డి
విశాఖ శారదా పీఠం వద్ద జరిగిన వాగ్యుద్ధంలో ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఓ పోలీసు అధికారిని బూతులు తిట్టడం తీవ్ర విమర్శల పాలవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పంచుకున్నారు. ఏపీలో ఓ మంత్రి భాష ఇలా ఉందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీస విలువలు లేకుండా తీవ్ర అహంకారం ప్రదర్శించారని విమర్శించారు.

పోలీసులూ... మిమ్మల్ని మీరు రక్షించుకోలేకపోతే మీరు ప్రజలను ఏం రక్షిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. మంత్రి సీదిరి అప్పలరాజును వెంటనే పదవి నుంచి తొలగించాలని సీఎం జగన్ ను కోరారు. అంతేకాకుండా, మంత్రిపై పోలీసు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.
Vishnu Vardhan Reddy
Seediri Appalaraju
Police
Video
YSRCP
Andhra Pradesh

More Telugu News