మరో డైరెక్టర్ కి పవన్ గ్రీన్ సిగ్నల్?
- విడుదలకి రెడీగా 'భీమ్లా నాయక్'
- ముగింపు దశలో 'వీరమల్లు'
- త్వరలో సెట్స్ పైకి 'భవదీయుడు భగత్ సింగ్'
- లైన్లో సురేందర్ రెడ్డి, రమేశ్ వర్మ
తదుపరి షెడ్యూల్ కి అవసరమైన సెట్స్ సిద్ధమవుతున్నాయి. ఈ నెలలోనే మళ్లీ పవన్ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత సినిమాను హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయనున్నారు. 'భవదీయుడు భగత్ సింగ్' టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ సినిమా తరువాత లైన్లో సురేందర్ రెడ్డి ఉన్నారు. ఆ తరువాత ప్రాజెక్టును కూడా పవన్ లైన్లో పెట్టేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. 'ఖిలాడి' దర్శక నిర్మాతలతో ఒక సినిమా చేయడానికి ఆయన ఓకే చెప్పినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.