YS Sharmila: మళ్లీ ప్రారంభం కానున్న షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర

YS Sharmila pada yatra to start from March 1
  • మార్చ్ 1న పాదయాత్ర ప్రారంభం
  • కరోనా వల్ల గత ఏడాది నవంబర్ 9న ఆగిపోయిన యాత్ర
  • మొత్తం 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగనున్న పాదయాత్ర
వైయస్సార్టీపీ అధినేత్రి షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. మార్చ్ 1వ తేదీ నుంచి పాదయాత్రను ఆమె చేపట్టనున్నారు. గత ఏడాది నవంబర్ 9వ తేదీన పాదయాత్ర ఆగిపోయింది. కరోనా నిబంధనల కారణంగా యాత్రకు బ్రేక్ పడింది. మార్చ్ 1న నల్గొండ జిల్లా కొండపాకగూడెం నుంచి షర్మిల పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. మొత్తం 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని షర్మిల ప్రతిరోజు టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన పాదయాత్రలో ప్రజలను నేరుగా కలుస్తూ ప్రభుత్వ వైఫల్యాలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు.
YS Sharmila
YSRTP
Padayatra

More Telugu News