TRS: టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలో చేరిన టీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్

TRS Municipal chairman joins BJP
  • బీజేపీలో చేరిన తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధు మోహన్
  • తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిక
  • స్థానిక సంస్థల ఎన్నికలో ఇండిపెండెంట్ గా గెలిచి, టీఆర్ఎస్ లో చేరిన మధు
టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధు మోహన్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో మధు మోహన్, ఆయన అనుచరులు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి బండి సంజయ్ కౌన్సిలర్ గా గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. మధు బీజేపీలో చేరడంతో టీఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురవుతున్నాయి.
TRS
Municipal Chairman
BJP

More Telugu News