Nagarjuna: వెబ్ సిరీస్ కోసం రెడీ అవుతున్న నాగ్!

Nagarjuna in Web Series
  • నాగ్ తాజా చిత్రంగా 'ది ఘోస్ట్'
  • కథానాయికగా సోనాల్ చౌహాన్ 
  • అమెజాన్ ప్రైమ్ కోసం చైతూ వెబ్ సిరీస్ 
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం నాగ్   
మొదటి నుంచి కూడా నాగార్జున కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ .. ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కొత్తగా అనిపించింది చేయడానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడరు. ఒక వైపున వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న ఆయన, ఓ వెబ్ సిరీస్ లో చేయడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు.

ఈ మధ్య కాలంలో ఓటీటీలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. దాంతో స్టార్ హీరోలు .. హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఆల్రెడీ చైతూ కూడా అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ చేయడానికి అంగీకరించాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ రూపొందనుంది.

ఈ నేపథ్యంలో నాగార్జున కూడా వెబ్ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం ఈ వెబ్ సిరీస్ రూపొందుతుందని చెబుతున్నారు. ఇక నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ది ఘోస్ట్' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా సోనాల్ చౌహన్ పేరు వినిపిస్తోంది.
Nagarjuna
Nagachaitanya
The Ghost Movie

More Telugu News