KTR: మిస్టర్ ప్రైమ్ మినిస్టర్... మీరు తెలంగాణ ప్రజల త్యాగాలను పదేపదే అవమానిస్తున్నారు: కేటీఆర్ ఆగ్రహం

KTR reacts to PM Modi comments on bifurcation
  • రాష్ట్ర విభజన సరిగా జరగలేదన్న మోదీ
  • రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకేనంటూ నేతల విమర్శలు
  • 'విష గురు' అంటూ బాల్క సుమన్ ట్వీట్
  • స్పందించిన కేటీఆర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిన తీరు సరిగా లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్విట్టర్ లో విశ్వగురు కాదు విష గురు అంటూ చేసిన పోస్టుపై కేటీఆర్ స్పందించారు. "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇది మీ స్థాయికి ఏమాత్రం తగినది కాదు" అని హితవు పలికారు. "తెలంగాణ ప్రజల త్యాగాలను, దశాబ్దాల తరబడి సాగిన స్ఫూర్తిదాయక పోరాటాన్ని మీరు పదేపదే అవమానిస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఈ వ్యాఖ్యల పట్ల ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
KTR
Narendra Modi
Bifurcation
Telangana
Andhra Pradesh

More Telugu News