Amit Shah: హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Union Home Minister Amit Shah arrives Hyderabad
  • అమిత్ షాకు స్వాగతం పలికిన బండి సంజయ్ తదితరులు
  • సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించనున్న అమిత్ షా
  • ముచ్చింతల్ ఆశ్రమానికి పయనం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తదితరులు స్వాగతం పలికారు. అభివాదం చేసిన బండి సంజయ్ ని ఆయన అభినందన పూర్వకంగా భుజం తట్టారు. కాగా, అమిత్ షా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు. అందుకోసం ఆయన విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లనున్నారు.
Amit Shah
Hyderabad
Bandi Sanjay
Muchintal
BJP
Telangana

More Telugu News