Sudheer Babu: 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' నుంచి సాంగ్ ప్రోమో!

Aa Ammayi Gurinchi Meeku Cheppali song promo released
  • ఇంద్రగంటి నుంచి మరో విభిన్న కథా చిత్రం 
  • సినిమా నేపథ్యంలో నడిచే కథ
  • డైరెక్టర్ పాత్రలో సుధీర్ బాబు 
  • సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్
ఈ మధ్య కాలంలో టైటిల్ తోనే ఆసక్తిని పెంచిన సినిమాలలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ఒకటిగా కనిపిస్తోంది. ఈ టైటిల్ రెండు రకాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంది. చెప్పేది అందమైన అమ్మాయి గురించే అయినా నాయిక ప్రధానమైన సినిమా కాదు. చెప్పనున్నది హీరో కనుక టైటిల్ ఆయన వైపు నుంచి కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది.

ఇంద్రగంటి మోహనకృష్ణ - సుధీర్ బాబు కాంబినేషన్లో రూపొందిన మూడో సినిమా ఇది. బెంచ్ మార్క్ స్టూడియోస్ - మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. సుధీర్ బాబు జోడీగా కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకి, వివేజ్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి 'కొత్త కొత్తగా' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.  

రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను చైత్ర ఆలపించారు. పూర్తి పాటను రేపు విడుదల చేయనున్నారు. సినిమా డైరెక్టర్ గా సుధీర్ బాబు కనిపిస్తుండగా, నటిగా మారిన డాక్టర్ గా కృతి శెట్టి కనిపించనుంది. అవసరాల శ్రీనివాస్ .. వెన్నెల కిశోర్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sudheer Babu
Krithi Shetty
Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie

More Telugu News