Harish Rao: తెలంగాణపై మోదీ అక్కసు వెళ్లగక్కారు: హరీశ్ రావు

Harish Rao fires on Harish Rao
  • రాజ్యసభలో మోదీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను గాయపరిచాయి
  • తెలంగాణ ఏర్పాటును ఎంత వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతోంది
  • తెలంగాణ ఏర్పడకపోతే ఇంత అభివృద్ధి సాధ్యమయ్యేదా?
తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. మోదీ వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు ఖండించారు. రాజ్యసభలో మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన ఎంత వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతోందని చెప్పారు. రాష్ట్రంపై ఉన్న అక్కసును వెళ్లగక్కారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ఇంత అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని అన్నారు. తెలంగాణ వచ్చిందని మనం ఆనందంగా ఉంటే... మోదీ మాత్రం బాధగా ఉన్నట్టున్నారని చెప్పారు. తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా మోదీ ద్వేషాన్ని చిమ్ముతున్నారని తెలిపారు.
Harish Rao
TRS
Narendra Modi
BJP

More Telugu News