Lata Mangeshkar: లతా మంగేష్కర్ రూ. 200 కోట్ల ఆస్తి ఎవరికి?
- తన జీవితంలో పెళ్లి చేసుకోని లతా మంగేష్కర్
- ఎవరినీ దత్తత తీసుకోని వైనం
- వీలునామాలో ఎవరి పేరు రాశారనే విషయంపై ఉత్కంఠం
గానకోకిల లతా మంగేష్కర్ ఇటీవల తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె మృతి షాక్ నుంచి ఇంకా జనాలు కోలుకోలేదు. మరోవైపు ఆమెకు సంబంధించిన ఒక విషయం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. లతకు రూ. 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. అయితే ఆ ఆస్తిని అనుభవించడానికి ఆమెకు వారసులు లేరు. ఆమె తన జీవితంలో వివాహం చేసుకోలేదు. అంతేకాదు ఎవరినీ దత్తత కూడా తీసుకోలేదు. ఈ నేపథ్యంలో, వీలునామాలో ఆస్తులను ఎవరి పేరిట రాశారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కొన్ని రోజుల్లో ఆమె లాయర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. లతకు తన తండ్రి పేరుతో ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ కే ఆమె ఆస్తులు వెళ్లనున్నాయని పలువురు భావిస్తున్నారు. లతకు తోబుట్టువులు ఉన్నారు. వీరి పేరిట ఏమైనా ఆస్తులు రాశారా? అనే చర్చ కూడా జరుగుతోంది.