OTT: ఓటీటీలో ఈ వారం వస్తున్న సినిమాలివే.. విక్రమ్– విక్రమ్ తనయుడు కలిసి నటించిన తొలి సినిమా కూడా ఓటీటీలోనే

These Are This Weeks Movies In OTTs
  • అమెజాన్ ప్రైమ్ లో 10 నుంచి ‘మహాన్’
  • ఆహాలో ప్రియమణి ‘భామా కలాపం’
  • ఫిబ్రవరి 11న జీ5లో సుమంత్ ‘మళ్లీ మొదలైంది’
కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. థియేటర్లు మూత పడడంతో చాలా వరకు సినిమాలన్నీ ఓటీటీల్లోనే విడుదలయ్యాయి. అయితే, ఇప్పటికే థియేటర్లు ఓపెన్ అయినా.. ఓటీటీలకు మాత్రం డిమాండ్ తగ్గలేదు. థియేటర్లలో సినిమాలు విడుదలవుతున్నా.. మరికొన్ని సినిమాలు మాత్రం ఓటీటీల బాట పడుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలూ ఇందుకు మినహాయింపేమీ కాదు.

తొలిసారి తండ్రీ కొడుకులు చియాన్ విక్రమ్, అతడి తనయుడు ధ్రువ్ విక్రమ్ లు కలిసి నటిస్తున్న సినిమా ‘మహాన్’. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ, కరోనా కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ లో సినిమాను విడుదల చేయనున్నారు.  

ప్రియమణి హీరోయిన్ గా అభిమన్యు తెరకెక్కించిన కథానాయికా ప్రాధాన్య సినిమా ‘భామా కలాపం’ ఫిబ్రవరి 11న ఆహాలో స్ట్రీమ్ కానుంది. కేవలం ఓటీటీ కోసమే తీసిన ‘గెహ్రాయియా’ ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. దీపికా పదుకోణ్, సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే, ధైర్యా కర్వాలు కీలకపాత్రలు పోషించారు.

సుమంత్ హీరోగా, వర్షిణీ సౌందర రాజన్, నైనా గంగూలీలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘మళ్లీ మొదలైంది’ సినిమా ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమ్ కానుంది. మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ హీరోగా పరిచయమైన సినిమా ‘హీరో’ ఫిబ్రవరి 11 నుంచి ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమ్ కానుంది.

మరికొన్ని...

  • ఐ వాంట్ యూ బ్యాక్ – హాలీవుడ్ మూవీ ప్రైమ్ లో ఫిబ్రవరి 11 నుంచి
  • కొరియా సిరీస్ ‘స్నో డ్రాప్’ – డిస్నీ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 9  
  • తమిళ సినిమా ‘సింగ పెన్నే’ – జీ5లో ఫిబ్రవరి 9 నుంచి
  • మలయాళ సినిమా ‘ఫ్రీడమ్ ఫైట్’– సోనీ లివ్ లో ఫిబ్రవరి 11 నుంచి
  • హిందీ సినిమా ‘రక్తాంచల్’– ఎంఎక్స్ ప్లేయర్ లో ఫిబ్రవరి 11 నుంచి

నెట్ ఫ్లిక్స్ లో:

  • క్యాచింగ్ కిల్లర్స్– వెబ్ సిరీస్ సీజన్ 2 ఫిబ్రవరి 9 నుంచి
  • ఇన్వెంటింగ్ అన్నా – వెబ్ సిరీస్ ఫిబ్రవరి 11 నుంచి
  • లవ్ అండ్ లీషెస్ – కొరియా సినిమా ఫిబ్రవరి 11 నుంచి
  • టాల్ గర్ల్ – హాలీవుడ్ సినిమా ఫిబ్రవరి 11 నుంచి
  • ద ప్రివిలేజ్ – హాలీవుడ్ సినిమా ఫిబ్రవరి 11 నుంచి
OTT
Amazon Prime
Zee 5
Disney Hotstar
Aha
Mahaan
Malli Modalaindi
Tollywood
Bollywood
Hollywood

More Telugu News