Prime Minister: ప్రధాని మోదీ హ్యాట్రిక్.. మూడో ఏడాదీ నెంబర్ వన్!

Prime Minister Narendra Modi Tops The List Of World Leaders In Morning Consult Survey
  • మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో వెల్లడి
  • జనామోదం ఉన్న నేతలపై సంస్థ సర్వే
  • 72 శాతం మంది మోదీకే పట్టం
  • ఆరో స్థానంలో అమెరికా అధ్యక్షుడు
  • ఆయనకు 41 శాతం మంది మద్దతు
ప్రధాని నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా మూడో ఏడాదీ ప్రపంచ నంబర్ వన్ నేతగా నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నూ తోసిరాజని మోదీ ప్రథమ స్థానం సాధించారు. మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచ దేశాధినేతల్లో అత్యంత జనామోదం ఉన్న నేతగా అత్యధిక మంది మోదీకే పట్టం కట్టారు. 72 శాతం మంది ఆయనకు ఆమోదం తెలిపారు.

ఆ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రడార్ ఉన్నారు. ఆయనకు 64 శాతం మంది మద్దతు ప్రకటించారు. 57 శాతం మంది ఆమోదంతో ఇటలీ ప్రధాని మారియో ద్రాగ్చి మూడో ర్యాంకు సాధించారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాకు 47 శాతం మంది మద్దతు ప్రకటించారు. ఐదో స్థానంలో జర్మనీ చాన్స్ లర్ ఒలాఫ్ షూల్జ్ (42%) నిలిచారు. బైడెన్ ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. ఆయనకు కేవలం 41 శాతం మందే ఓటేశారు.

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూలకూ 41 శాతం మందే మద్దతు తెలపడంతో.. బైడెన్ తో పాటే సంయుక్తంగా ఆరో స్థానాన్ని పంచుకున్నారు. 37 శాతం ఓట్లతో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఏడు, 36 శాతం ఓట్లతో బ్రెజిల్ అధ్యక్షుడు జయర్ బోల్సోనారో ఎనిమిదో ర్యాంకు, 35 శాతం ఓట్లతో ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయేల్ మెక్రాన్  9వ ర్యాంకు, 30 శాతం మంది ఆమోదంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదో స్థానంలో నిలిచారు.

కాగా, 21 శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకించారు. మరో 7 శాతం మంది తమకేం తెలియదంటూ పేర్కొన్నారు.
Prime Minister
India
Narendra Modi
Morning Consult
USA
Joe Biden

More Telugu News