Shahrukh Khan: లతా మంగేష్కర్ భౌతికకాయంపై షారుఖ్ ఖాన్ ఉమ్మేశాడంటూ విమర్శలు.. అసలు నిజం ఏమిటంటే?

Shah Rukh Khan offers prayers got Lata Mangeshkar
  • నిన్న లతకు నివాళి అర్పించిన షారుఖ్
  • ఇస్లాం సంప్రదాయం ప్రకారం గాలి ఊదిన షారుఖ్
  • ఉమ్మేశాడంటూ విమర్శలు గుప్పించిన పలువురు నెటిజెన్లు
గానకోకిల లతా మంగేష్కర్ గొంతు నిన్న శాశ్వతంగా మూగబోయింది. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఆమె తుదిశ్వాస విడిచారు. నిన్న సాయంత్రం ముంబైలో అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు ఆమె పార్థివ దేహానికి ప్రధాని మోదీ సహా ఎందరో రాజకీయ, సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా ఆమెకు నివాళి అర్పించారు. అయితే, నివాళి అర్పించే సమయంలో షారుఖ్ చేసిన ఒక పని విమర్శలపాలయింది.

తన మేనేజర్ పూజ దద్లానీతో కలిసి ఆయన నివాళి అర్పించారు. పూజ చేతులు జోడించి నివాళి అర్పించగా... షారుఖ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం దువా చేశారు. అయితే ఆ సందర్భంగా లత పాదాల వద్ద షారుఖ్ ఉమ్మేశాడంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. అయితే, ఇక్కడే విమర్శకులు ఒక విషయాన్ని మర్చిపోయారు.

ఇస్లాం సంప్రదాయం ప్రకారం షారుఖ్ గాలి ఊదారు. దువాను చదువుతూ ఆమె భౌతికకాయంపై షారుఖ్ గాలి ఊదారు. ఆమె ఆత్మ సురక్షితంగా ఉండేందుకు, మరో జన్మలో కూడా ఆమెకు దేవుడి ఆశీస్సులు ఉండాలని షారుఖ్ ఇలా చేశారు. అంత్యక్రియల సందర్భంగా హిందువులు చేసే ప్రార్థనల మాదిరే... ముస్లింలు కూడా వారి మతాచారాల ప్రకారం ఇలా చేస్తారు. దీన్ని అర్థం చేసుకోలేక... కొందరు ఆయనపై విమర్శలు గుప్పించారు. మరోవైపు ఎందరో హిందువులు షారుఖ్ కు మద్దతుగా నిలవడం గమనార్హం.
Shahrukh Khan
Lata Mangeshkar
Bollywood
Mortal
Spit

More Telugu News