cert warning: హ్యాకర్లకు లక్ష్యంగా మారిన గూగుల్ క్రోమ్.. యూజర్లకు హెచ్చరిక..

Google Chrome users government has a warning for you
  • బగ్ లను లక్ష్యంగా చేసుకుంటున్న హ్యాకర్లు
  • క్రోమ్ తాజా వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి
  • కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సీఈఆర్టీ సూచన
  • గూగుల్ నుంచి కూడా ఇదే సూచన
గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ పరిధిలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) హెచ్చరిక జారీ చేసింది. గూగుల్ క్రోమ్ దాడులకు లక్ష్యంగా మారినట్టు తెలిపింది. హ్యాకర్లు గూగుల్ క్రోమ్ లోని లోపాలను (బగ్ లు) అనుకూలంగా చేసుకుని ఎంపిక చేసుకున్న కంప్యూటర్లపై దాడిగి దిగుతున్నట్టు తెలిపింది.

హ్యాకర్లు గూగుల్ క్రోమ్ లోని లోపాలను అనుకూలంగా చేసుకుంటే అప్పుడు క్రోమ్ యూజర్ల రక్షణ ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. క్రోమ్ 98.0.4758.80 వెర్షన్ కంటే ముందు వెర్షన్లలోనే ఈ సమస్య ఉన్నట్లు సీఈఆర్టీ తెలిపింది. మరోవైపు గూగుల్ ఇప్పటికే అప్ డేటెడ్ వెర్షన్ ద్వారా ఈ లోపాలను సరి చేసింది. 27 సెక్యూరిటీ అంశాలకు పరిష్కారం చూపించింది. యూజర్లు గూగుల్ కొత్త వెర్షన్ కు అప్ డేట్ కావాలని సదరు సంస్థ సూచించింది.

విండోస్ యూజర్లు అయితే గూగుల్ క్రోమ్ తాజా వెర్షన్ 98.0.4758.80/81/82 ను డౌన్ లోడ్ చేసుకోవాలి. మ్యాక్, లైనక్స్ యూజర్లు 98.0.4758.80 వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. చాలా వరకు లోపాలకు పరిష్కారం చూపించినట్టు తెలిపింది.
cert warning
google chrome
bugs
hackers

More Telugu News