China: కశ్మీర్ పై ఏకపక్ష చర్యలను ఆమోదించం: చైనా

Opposed To Unilateral Actions To Resolve Kashmir Issue China
  • శాంతియుత, చర్చల ద్వారా పరిష్కారానికే మద్దతు
  • పాకిస్థాన్ కు మా మద్దతు ఉంటుంది
  • హామీనిచ్చిన చైనా
  • ముగిసిన ఇమ్రాన్ ఖాన్ పర్యటన
చైనా మరోసారి పాకిస్థాన్ కు స్నేహహస్తం అందించింది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన నాలుగు రోజుల చైనా పర్యటనలో చివరి రోజు అధ్యక్షుడు జిన్ పింగ్ ను కలుసుకుని చర్చలు నిర్వహించారు.

పాకిస్థాన్ జాతీయ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, గౌరవం, తీవ్రవాదంపై పోరుకు తమ మద్దతు ఉంటుందని ఇమ్రాన్ తో జిన్ పింగ్ చెప్పినట్టు జిన్హువా న్యూజ్ ఏజెన్సీ తెలిపింది. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) ను ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్థాన్ తో కలసి పనిచేస్తామని హామీనిచ్చారు.

కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చైనా మద్దతునిస్తున్నట్టు అక్కడి అధికార యంత్రాంగం పేర్కొంది. ఏకపక్ష చర్యలు పరిస్థితిని తీవ్రతరం చేస్తాయని, వీటిని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. శాంతియుత, సౌభాగ్య దక్షిణాసియా అన్నది ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షగా సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
China
pakistan
Kashmir Issue

More Telugu News