రాహుల్ గాంధీ వర్చువల్ ర్యాలీకి ఆదరణ.. లైవ్ ద్వారా 11 లక్షల మంది వీక్షణ
- సోషల్ మీడియా వేదికలపై ప్రసారం
- లైవ్ లో 90 వేల మంది
- ఫేస్ బుక్ పేజీ నుంచి 8.8 లక్షల మంది
- కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ప్రకటన
రాహుల్ గాంధీ పేస్ బుక్ పేజీలో 42,000 కామెంట్లు వచ్చాయి. 6,000 మంది షేర్ చేసుకోగా, 11 లక్షల మందిని ఇది చేరుకున్నట్టు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం తెలిపింది. ఈ సభను ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా ప్రసారం చేశారు. పంజాబ్ లోని అన్ని జిల్లాల్లోనూ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఫేస్ బుక్ లైవ్ పై 90,000 వ్యూస్ అన్నవి చాలా ఎక్కువగా కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.