Lata Mangeshkar: శతాబ్దానికి ఒక్కరు.. లత మరణంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచారం

Ramnath Kovind Expresses Grief Over Lata Mangeshkar Demise
  • ప్రపంచంలోని అభిమానులందరికీ శరాఘాతం లాంటి వార్తే
  • మానవత, దయాగుణానికి మారుపేరు
  • గళం మూగబోయినా.. పాట చిరకాలం ఉంటుందని ఆకాంక్ష
లతా మంగేష్కర్ చనిపోయారన్న వార్త గుండెని ముక్కలు చేసిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉన్న ఆమె అభిమానులందరికీ అది శరాఘాతం లాంటి వార్తేనన్నారు. దేశ గొప్పదనం గురించి ఆమె పాడిన పాటలు.. ఎన్నో తరాల్లోని అంతరంగాలకు అద్దం పట్టిందని ఆయన చెప్పారు. ఆమె సాధించిన గొప్ప గొప్ప విజయాలకు వేరేవీ సాటి రావన్నారు.

ఇలాంటి తారలు శతాబ్దంలో ఒకరు మాత్రమే పుడతారని పేర్కొన్నారు. తాను ఆమెను కలిసిన ప్రతి సందర్భంలోనూ ఆమెలో ఉన్న మానవతా కోణాన్ని, దయాగుణాన్ని చూశానని పేర్కొన్నారు. తియ్యటి స్వరంతో ఎన్నో పాటలను పాడిన గళం ఇప్పుడు మూగబోయి ఉండొచ్చుగాక.. ఆమె పాటలు మాత్రం చిరకాలం ఉంటాయని, ప్రతిధ్వనిస్తుంటాయని ఆయన అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

Lata Mangeshkar
President Of India
Ramnath Kovind

More Telugu News