Bengaluru: ఆస్తి తన పేరున రాయాలంటూ గదిలో బంధించి భార్య, అత్త వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న అల్లుడు

Man committed suicide after wife and mother in laws assault
  • బెంగళూరులో ఘటన
  • భార్య, అత్త, బావమరిది వేధింపులు భరించలేకేనంటూ లేఖ
  • వేధింపులు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన
ఆస్తిని తన పేరున రాయాలంటూ భార్య, అత్త పెడుతున్న వేధింపులు భరించలేని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. దొడ్డబళ్లాపుర సమీపంలోని తోటనహళ్లికి చెందిన ఆనంద్ కుమార్ (43) మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఆస్తిని తన పేరున రాయాలంటూ భర్తను గదిలో బంధించిన భార్య నీలమ్మ.. తల్లి గంగమ్మ, సోదరుడు గంగరాజుతో కలిసి వేధించసాగింది.

వారి వేధింపులు నిత్యకృత్యం కావడంతో మనస్తాపం చెందిన ఆనంద్ కుమార్ లేఖ రాసి ఉరివేసుకున్నాడు. భార్య, అత్త, బావమరిది వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bengaluru
Karnataka
Suicide

More Telugu News