Venkatrami Reddy: పట్టు విడుపులకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం: సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి

We are ready to compromise in some matters says Venkatrami Reddy
  • ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయి
  • ఐదేళ్ల పీఆర్సీ పట్ల సంతృప్తిగా ఉన్నాం
  • ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నాం
తమ సమస్యల సాధనలో పట్టువిడుపులకు తాము సిద్ధమని పీఆర్సీ సాధన స్టీరింగ్ కమిటీ సభ్యుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. అంశాలన్నీ ఒకదానితో మరొకటి లింక్ అయి ఉన్నాయని... కొన్నింటిలో ప్రభుత్వం, మరికొన్నింటిలో తాము సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

ఐదేళ్ల పీఆర్సీ పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని తెలిపారు. అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన రిపోర్టును బయటపెట్టాల్సిందేనని చెప్పారు. ఎక్కువ మంది ఉద్యోగులు సంతోషపడేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందనే ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఈరోజు సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నామని చెప్పారు.
Venkatrami Reddy
AP Secretariat
PRC

More Telugu News