Narendra Modi: హైదరాబాదు పర్యటనలో భాగంగా ఇక్రిశాట్ చేరుకున్న ప్రధాని మోదీ

PM Narendra Modi arrives ICRISAT
  • హైదరాబాదు పర్యటనకు విచ్చేసిన మోదీ
  • ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరు
  • పంట క్షేత్రాల పరిశీలన
  • శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటనకు విచ్చేశారు. ఆయన కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పటాన్ చెరులోని ఇక్రిశాట్ చేరుకున్నారు. ఇక్రిశాట్ స్థాపించి 50 ఏళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొంటారు.

కాగా, ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇక్రిశాట్ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్ల కోసం సుమారు ఏడు వేల మంది పోలీసులను మోహరించారు.

ఇక్రిశాట్ లో పర్యటిస్తున్న సందర్భంగా మోదీ 7 నిమిషాల పాటు అక్కడి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించనున్నారు. అనంతరం ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలోని శాస్త్రవేత్తలను ఉద్దేశించి 10 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు.

  • Loading...

More Telugu News