KCR: హైదరాబాద్ చేరుకున్న మోదీ.. జ్వరం కారణంగా దూరంగా ఉన్న కేసీఆర్

KCR not going to meet Modi as he is not feeling well
  • రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ
  • ఎయిర్ పోర్టులో స్వాగతం పలకనున్న గవర్నర్, మంత్రి తలసాని
  • పీఎం పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు
ప్రధాని మోదీ కాసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మోదీకి గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చీఫ్ సెక్రటరీ, డీజీపీలు స్వాగతం పలకనున్నారు. స్వల్ప జ్వర లక్షణాలతో ఆయన ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పర్యటనలో ఆయన రెండు కార్యక్రమాల్లో పొల్గొననున్నారు. ఇక్రిశాట్ 50 ఏళ్ల ఉత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఆయన ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
KCR
TRS
Narendra Modi
BJP
Hyderabad

More Telugu News