Third wave: సమీప భవిష్యత్తులో కొత్త వేరియంట్ రాకపోతే కరోనా ముగిసినట్టే: ఐసీఎంఆర్ ఏడీజీ డాక్టర్ పాండా

Third wave to ebb by March ICMR ADG

  • ఫిబ్రవరి చివరికి మూడో విడత ముగింపు 
  • దేశవ్యాప్తంగా మార్చి చివరికి తగ్గుముఖం
  • కొత్త వేరియంట్ రాకపోతే ఎండెమిక్ గా మారిపోతుంది

మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కరోనా మూడో విడత మూడు వారాల్లో ముగిసిపోతుందని ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) డాక్టర్ సమీర్ పాండా అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మార్చి చివరికి తగ్గుముఖం పడతాయని అంచనా వేశారు.

‘‘కొత్తగా ఎటువంటి కరోనా రకాలు సమీప భవిష్యత్తులో వెలుగు చూడకపోతే అప్పుడు పరిస్థితులన్నీ నియంత్రణలో ఉన్నట్టే. అంటువ్యాధి దశ నుంచి మహమ్మారి స్థానిక వ్యాధి (ఎండెమిక్/సాధారణ ఫ్లూ) దశకు మారిపోతుంది‘‘ అని డాక్టర్ పాండా తెలిపారు. జనవరి మొదట్లో ఎక్కువ కేసులు వచ్చిన చోట ఇప్పుడు తగ్గడం కనిపిస్తోందన్నారు.

ఐసీఎంఆర్ ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ చంద్రకాంత్ లహారియా సైతం కరోనా మూడో విడత వచ్చే మూడు నాలుగు వారాల్లో ముగింపు దశకు వస్తుందని చెప్పారు. ‘‘ఒమిక్రాన్ కేసులు 90 శాతం ఉంటున్నాయి. మరో 10 శాతం కేసులు డెల్టా రకానివి’’ అని ఆయన తెలిపారు.

Third wave
ICMR
Dr panda
pandemic
epidemic
endemic
  • Loading...

More Telugu News