ఒక దర్శకుడు నన్ను మోసం చేశాడు: జయవాణి
- ఒక దర్శకుడు నాతో ఫొటో షూట్ చేయించాడు
- ఆ తర్వాత అతన్నుంచి నాకు ఫోన్ కూడా రాలేదు
- ఆ తర్వాత ఆ ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయన్న జయవాణి
తాను నల్లగా ఉన్నానని, నటిగా సెట్ కాలేనని మొదట్లో తనను చాలా మంది అవమానించారని జయవాణి చెప్పింది. ఆ సమయంలో ఒక సినిమా ఉందని, ఫొటో షూట్ కు రావాలంటూ ఓ దర్శకుడు తనను పిలిపించాడని... ఫొటో షూట్ చేసిన తర్వాత ఆయన నుంచి కనీసం ఫోన్ కూడా రాలేదని తెలిపింది.
అయితే ఆ ఫొటో షూట్ కు సంబంధించిన ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఫొటోలు తన కెరీర్ కే ఒక మచ్చగా నిలిచిపోయాయని తెలిపింది. ఆ ఫొటోలు ఎవరు పెట్టారో కూడా తనకు తెలియదని అన్నారు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇన్ని సినిమాల్లో నటించినా అనుకున్నంత ఫేమ్ రాలేదని చెప్పారు.