Justin Langer: ఆస్ట్రేలియా క్రికెట్ హెడ్ కోచ్ పదవికి జస్టిన్ లాంగర్ రాజీనామా

Justin Langer Delivers Shock Resignation As Australia Head Coach
  • 2018లో హెడ్ కోచ్ బాధ్యతలను స్వీకరించిన లాంగర్
  • లాంగర్ పర్యవేక్షణలో టీ20 వరల్డ్ కప్, యాషెస్ సిరీస్ ల ను కైవసం చేసుకున్న ఆసీస్
  • రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన లాంగర్

ఆస్ట్రేలియా క్రికెట్ హెడ్ కోచ్ పదవికి జస్టిన్ లాంగర్ రాజీనామా చేశాడు. టీ20 ప్రపంచకప్ తో పాటు ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ ను కైవసం చేసుకున్న తరుణంలో ఆయన రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొందరు ఆటగాళ్లతో ఆయనకు పొసగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు లాంగర్ పదవీకాలాన్ని పొడిగించే విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సభ్యులు నిన్న రాత్రి సుదీర్ఘ చర్చలు జరిపినప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో లాంగర్ తనంతట తాను హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని లేఖలో ఆయన పేర్కొన్నారు.  

బ్యాట్స్ మెన్ గా ఆస్ట్రేలియాకు లాంగర్ ఎంతో సేవ చేశాడు. ఆసీస్ ఘన విజయాల వెనుక కీలక పాత్రను పోషించాడు. 2018 లో ఆయన హెడ్ కోచ్ బాధ్యతలను స్వీకరించాడు. దశాబ్దాల కాలంలో ఆస్ట్రేలియా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న తరుణంలో కోచ్ పదవిని చేపట్టిన లాంగర్... జట్టును మళ్లీ విజయాలవైపు మళ్లించాడు.

  • Loading...

More Telugu News