Samantha: హీరోయిన్ కాకముందు ఎన్నో కష్టాలు పడ్డాను.. రూ. 500 కోసం పని చేశాను: సమంత

I stopped my education as I dont have money says Samantha
  • డబ్బులు లేక చదువు మానేయాల్సి వచ్చింది
  • ఫంక్షన్లలో గెస్టులకు వెల్ కమ్ చెప్పే అమ్మాయిగా కూడా పని చేశాను
  • మోడలింగ్ కు వెళ్లే సమయంలో కొందరు వెనక్కి లాగే ప్రయత్నం చేశారు
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న సమంత.. నార్త్ లో సైతం సత్తా చాటుతోంది. ప్రతి సినిమాకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే సమంత బాల్యం అంత హాయిగా ఏమీ సాగలేదు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తాను చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

చదువులో తాను టాప్ స్టూడెంట్ అయినప్పటికీ డబ్బులు లేక చదువు మానేయాల్సి వచ్చిందని సమంత వెల్లడించింది. హీరోయిన్ కాకముందు పెద్దపెద్ద ఫంక్షన్లలో అతిథులకు వెల్ కమ్ చెప్పే అమ్మాయిగా కూడా పని చేశానని... ఈ పని చేసినందుకు నిర్వాహకులు తనకు రోజుకు రూ. 500 ఇచ్చేవారని చెప్పింది. అంతేకాదు, పాకెట్ మనీ కోసం మోడలింగ్ దిశగా అడుగులు వేసే సమయంలో... 'నీకు ఇది అవసరమా?' అని కొందరు వెనక్కి లాగే ప్రయత్నం చేశారని తెలిపింది. అయితే తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ముందడుగు వేశానని ఆమె చెప్పింది.
Samantha
Tollywood
Childhood
Problems

More Telugu News