Indian names: ఏ మాత్రం రక్షణనివ్వని చెత్త పాస్ వర్డ్ లు ఇవి..!

  • పేర్లతోనే పాస్ వర్డ్ లు
  • ఎక్కువ మంది అనుసరిస్తున్న విధానం
  • హ్యాకర్లు, నేరస్థులు వీటిని ఊహించగలరు
  • పటిష్ఠ పాస్ వర్డ్ తోనే రక్షణ
These 50 Indian names are on the worst passwords list

పాస్ వర్డ్ అన్నది ఎందుకు? ఎవరు పడితే వారు మన ఖాతాల్లోకి ప్రవేశించకుండా, మనకు సంబంధించిన సమాచారం తెలుసుకోకుండా రక్షణ కల్పించుకునేందుకు. పాస్ వర్డ్ అన్నది పటిష్ఠంగానే ఉంటేనే రక్షణ. ఇతరులకు సులభంగా తెలిసే పాస్ వర్డ్ లను పెట్టుకోవడం వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అప్పుడు పాస్ వర్డ్ ఉన్నా, లేకపోయినా ఒకటే.

సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ ‘నార్డ్ పాస్’ 200 కామన్ పాస్ వర్డ్ లతో ఏటా జాబితా విడుదల చేస్తుంటుంది. వీటిని హ్యాకర్లు, నేరస్థులు సులభంగా ఊహించి యాక్సెస్ చేసుకోగలరు. భారతీయులు ఎక్కువ మంది పేర్లను పాస్ వర్డ్ గా వినియోగిస్తున్నారంటూ వాటి వివరాలను ఒక నివేదిక రూపంలో వెల్లడించింది. వీటిల్లో ఏదైనా పేరును మీరు కూడా పాస్ వర్డ్ గా పెట్టుకుంటే రక్షణ దృష్ట్యా మార్చుకోవడం మంచిది.

అభిషేక్, ఆదిత్య, ఆశిష్, అంజలి, అర్చన, అనురాధ, దీపక్, దినేష్, గణేష్, గౌరవ్, గాయత్రి, హనుమాన్, హరి ఓం, హర్ష, కృష్ణ, ఖుషి, కార్తీక్, లక్ష్మి, లవ్లీ, మనీష్, మనీషా, మహేష్, నవీన్, నిఖిల్, ప్రియాంక, ప్రకాష్, పూనమ్, ప్రశాంత్, పంకజ్, ప్రసాద్, ప్రదీప్, ప్రవీణ్, రష్మి, రాహుల్, రాజ్ కుమార్, రాకేశ్, రమేష్, రాజేష్, సాయిరామ్, సచిన్, సంజయ్, సందీప్, స్వీటీ, సురేష్, సంతోష్, సిమ్రాన్, సంధ్య, సన్నీ, టింకిల్, విశాల్.. ఈ పేర్లను పాస్ వర్డ్ గా చాలా మంది ఉపయోగిస్తున్నారు.

More Telugu News