Raj Kundra: శిల్పాశెట్టి పేరిట ఆస్తులను బదలాయించిన రాజ్ కుంద్రా

Raj Kundra transfers apartments in Mumbai worth Rs 38 crore to Shilpa Shetty
  • ఐదు ఫ్లాట్స్ భార్య పేరిట మార్పిడి
  • వీటి విలువ రూ.35 కోట్లు
  • 1.9 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లింపు
  • ప్రస్తుత నివాసం అక్కడే
పోర్నోగ్రఫీ చిత్రాలను నిర్మించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ, బెయిల్ పై బయట ఉన్న రాజ్ కుంద్రా కీలక నిర్ణయం ఒకటి తీసుకున్నారు. ముంబైలోని జుహూ సమీపంలో తన పేరిట ఉన్న ఖరీదైన ఆస్తులను అర్ధాంగి, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పేరు మీదకు మార్చేశారు. వీటి విలువ రూ.38.5 కోట్లు. జనవరి 21న జరిగిన ఈ లావాదేవీ వివరాలను జప్ కే డాట్ కామ్ వెలుగులోకి తీసుకొచ్చింది.

జుహూలోని గాంధీగ్రామ్ రోడ్డులో సముద్ర తీరానికి 300 మీటర్ల దూరంలో ఈ అపార్ట్ మెంట్ ఉంది. కుంద్రా దంపతులు ప్రస్తుతం ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇందులో మొదటి అంతస్తులోని ఐదు ఫ్లాట్స్ కుంద్రా పేరుమీదే ఉన్నాయి. వీటి విస్తీర్ణం 5,995 చదరపు అడుగులు.

ప్రస్తుత మార్కెట్ విలువ ఒక్కో చదరపు అడుగు రూ.65,000గా ఉంది. ఈ లావాదేవీలో భాగంగా శిల్పాశెట్టి రూ.1.9 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. తన పేరిట ఉన్న  ఆస్తులను రాజ్ కుంద్రా భార్య పేరిట ఎందుకు మార్చారనే వివరాలు బయటకు రాలేదు.
Raj Kundra
Shilpa Shetty
mumbai
apartments
transfered

More Telugu News