Corona Virus: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి... తాజా బులెటిన్ ఇదిగో!

Here it is AP Corona Bulletin
  • గత 24 గంటల్లో 30,578 కరోనా టెస్టులు
  • 4,605 మందికి పాజిటివ్
  • తూర్పుగోదావరి జిల్లాలో 642 కొత్త కేసులు
  • రాష్ట్రంలో 10 మరణాలు
  • ఇంకా 93,488 మందికి చికిత్స

ఏపీలో కరోనా ఉద్ధృతి నిదానించింది. వారం కిందట 10 వేలకు పైన నమోదైన కొత్త కేసులు, తాజాగా 5 వేల కంటే దిగువన నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 30,578 కరోనా పరీక్షలు నిర్వహించగా... 4,605 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 642 కొత్త కేసులు వెల్లడి కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 539, గుంటూరు జిల్లాలో 524, నెల్లూరు జిల్లాలో 501 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 11,729 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 14,641కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 22,93,171 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,85,042 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా లక్ష లోపే నమోదైంది. ప్రస్తుతం 93,488 మంది చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News