Balakrishna: హిందూపురంను కొత్త జిల్లా కేంద్రం చేయాలంటూ.. రేపు పట్టణంలో బాలకృష్ణ ర్యాలీ

Balakrishna conducts rally in Hindupur for new district
  • పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం
  • అంబేద్కర్ విగ్రహం వద్ద బాలయ్య మౌనదీక్ష
  • ఉద్యమ కార్యాచరణపై అఖిలపక్ష నేతలతో చర్చలు 
కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు హిందూపురంను కేంద్రంగా చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపు ఉదయం హిందూపురంలో ఆయన ర్యాలీ నిర్వహించనున్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరగనుంది. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఉద్యమ కార్యాచరణపై రేపు సాయంత్రం అఖిలపక్ష నేతలతో చర్చించనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు.
Balakrishna
Hindupur
Rally
New District
TDP
Anantapur District
Andhra Pradesh

More Telugu News