Pinarayi Vijayan: మలయాళంలో ట్వీట్ చేసిన దుబాయ్ రాజు.. అరబిక్ లో రిప్లై ఇచ్చిన కేరళ సీఎం!

Dubai king tweets in Malayalam and Pinarayi Vijayan replies in Arabic
  • యూఏఈ పర్యటనలో ఉన్న పినరయి విజయన్
  • కేరళతో యూఏఈకి ప్రత్యేక అనుబంధం ఉందన్న దుబాయ్ రాజు
  • బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామన్న విజయన్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్నారు. దుబాయ్ రాజు, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తో ఆయన భేటీ అయ్యారు. భేటీ ముగిసిన వెంటనే దుబాయ్ రాజు మలయాళంలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విజయన్ షేర్ చేశారు. అంతేకాదు. అరబిక్ భాషలో ఆయన రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
 
మలయాళంలో దుబాయ్ రాజు చేసిన ట్వీట్: కేరళతో యూఏఈకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దుబాయ్, యూఏఈ ఆర్థికాభివృద్ధితో పాటు అన్ని రకాల అభివృద్ధిలో కేరళ ప్రజల పాత్ర ఎంతో గొప్పది.
 
దుబాయ్ రాజు ట్వీట్ కు విజయన్ రిప్లై: మీ ఆత్మీయ స్వాగతానికి, ఆతిథ్యానికి ధన్యవాదాలు. యూఏఈ, దుబాయ్ లతో బంధాలను మరింత బలోపేతం చేసుకుంటాం.
Pinarayi Vijayan
Kerala
Dubai King
Sheikh Mohamed bin Rashid Al Maktoum

More Telugu News