Bangalore: పునీత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బెంగ‌ళూరు చేరుకున్న అల్లు అర్జున్

allu arjun reaches Bangalore
  • హైద‌రాబాద్ నుంచి వెళ్లిన బ‌న్నీ
  • ముందుగా పునీత్‌ కుటుంబ సభ్యులను ప‌రామ‌ర్శించ‌నున్న హీరో
  • ఆ త‌ర్వాత‌ పునీత్‌ సమాధి వ‌ద్ద‌కు అల్లు అర్జున్
కన్నడ స్టార్ హీరో పునీత్‌ రాజ్ కుమార్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు సినీ న‌టుడు అల్లు అర్జున్ హైద‌రాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాడు. ఈ రోజు ఉద‌యం హైదరాబాద్‌ నుంచి ఆయ‌న‌ బయలుదేరి బెంగళూరు చేరుకున్నాడు. ముందుగా పునీత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ త‌ర్వాత‌ పునీత్‌ సమాధిని బ‌న్నీ సందర్శించ‌నున్నాడు. పునీత్ స‌మాధి వ‌ద్ద బ‌న్నీ నివాళులు అర్పించనున్నాడు.

కాగా, గ‌త ఏడాది అక్టోబరు 29న పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ప‌లువురు తెలుగు హీరోలు ఇప్ప‌టికే బెంగళూరుకు వెళ్లి పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు.
Bangalore
Karnataka
Allu Arjun
Pushpa

More Telugu News