Rashmika Mandanna: కొత్త ఇంట్లోకి మారుతున్న రష్మిక మందన్న

Rashmika Mandanna shifting to new home
  • 2021 ఫిబ్రవరిలో ముంబైలో ఇంటిని కొనుగోలు చేసిన రష్మిక
  • బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న కన్నడ బ్యూటీ
  • సొంత ఇంటికి షిఫ్ట్ అయ్యే పనిలో ఉన్న రష్మిక
కన్నడ భామ రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో సైతం అవకాశాలను అందుకుంటూ ఉత్తరాదిన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా నిన్న ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. సామాన్లు ప్యాక్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నానని ఆమె తెలిపింది. దీంతో ఆమె కొత్త ఇల్లు కొనుక్కుందా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

వాస్తవానికి 2021 ఫిబ్రవరిలోనే ముంబైలో రష్మిక ఒక ఇంటిని కొనుగోలు చేసింది. బాలీవుడ్ లో నటిస్తున్న నేపథ్యంలో ఆమె ముంబైలో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' అనే రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో హోటళ్లలో బస చేయకుండా... సొంత ఇంటికి మారే ప్రయత్నంలో రష్మిక ఉంది. ఇక తెలుగు విషయానికి వస్తే... 'పుష్ప.. ది రూల్' సినిమా షూటింగ్ కు ఆమె సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఈ ఏడాది డెసెంబర్ లో థియేటర్లలోకి రానుంది.
Rashmika Mandanna
Tollywood
Bollywood
New House

More Telugu News