Andhra Pradesh: ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

Night Curfew extended in Andhra Pradesh
  • ఫిబ్రవరి 14 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు
  • మాస్క్ లేకపోతే రూ. 100 జరిమానా
  • థియేటర్లలో 50 శాతం మందికి మాత్రమే అనుమతి

కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని పొడిగించింది. ఫిబ్రవరి 14 వరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈరోజుతో నైట్ కర్ఫ్యూ ముగియనుండటంతో... దాన్ని పొడిగించాలని నిర్ణయించింది.

మరోవైపు కరోనా నిబంధనలు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, మాస్క్ లేకపోతే రూ. 100 జరిమానా విధిస్తామని చెప్పింది. వివాహాలు, మతపరమైన కార్యక్రమాలకు బహిరంగ ప్రదేశంలో అయితే గరిష్ఠంగా 200 మంది, ఇన్ డోర్ అయితే 100 మందికి అనుమతి ఉంటుంది. సినిమా థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

  • Loading...

More Telugu News