AP High Court: ఉద్యోగుల నుంచి జీతం రికవరీ చేయొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం

AP High Court orders government not to recover salary from employees
  • పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్
  • పిటిషన్ వేసిన గెజిటెడ్ అధికారుల ఐకాస అధ్యక్షుడు
  • కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారించింది. పీఆర్సీ జీవోల ద్వారా సర్వీస్ బెనెఫిట్స్ ను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య ఈ పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఆర్థిక, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్ ను చేర్చారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
AP High Court
Government
PRC

More Telugu News