: బూతులు వాడిన టీవీ చానల్ పై 10 రోజుల నిషేధం
బూతు డైలాగులు, అసభ్యకరమైన పదాలను వాడిన అమెరికా టెలివిజన్ చానల్ కామెడీ సెంట్రల్ పై 10 రోజుల పాటు నిషేధం విధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కామెడీ సెంట్రల్ 'స్టాండ్ అప్ క్లబ్', 'పాప్ కార్న్' కార్యక్రమాలలో ఈ పదాలు, డైలాగులు వాడడం ద్వారా కేబుల్ టీవీ చట్ట నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ చానల్ ప్రసారాలను మన దేశంలో నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఆదేశించింది.