Vijay Devarakonda: నిజంగా 'తుపానే'.. హాలీవుడ్ సినిమాని తలపించిన విజయ్ దేవరకొండ థమ్స్ అప్ యాడ్!

Vijay Devarakonda is new brand ambassador for Thums Up
  • థమ్స్ అప్ బ్రాండ్ అంబాసడర్ గా విజయ్ దేవరకొండ
  • యాడ్ లో తుపాను ఎలా ఉంటుందో చూపించిన విజయ్
  • యాడ్ లో ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు
'తూఫాన్' అంటూ నిన్న సోషల్ మీడియాలో రచ్చ చేసిన విజయ్ దేవరకొండ... థమ్స్ అప్ యాడ్ తో నిజంగానే తుపాను ఎలా ఉంటుందో చూపించాడు. బాలీవుడ్ సినిమా తరహాలో ఈ యాడ్ ఉత్కంఠభరితంగా ఉంది.
 
ఓ సినిమా థియేటర్ లో సగటు ప్రేక్షకుడిలా విజయ్ కనిపించడంతో యాడ్ మొదలవుతుంది. థియేటర్ లో కూల్ డ్రింక్స్ అమ్ముకునే కుర్రాడు విజయ్ వద్దకు వస్తాడు. 'సాఫ్ట్ డ్రింక్' అని విజయ్ ని అతను అడుగుతాడు. దీంతో తలపైకెత్తిన విజయ్... 'సాఫ్ట్ డ్రింకా?' అని అడుగుతూ తెరపైకి చూడమని చెపుతాడు. తెరపైకి చూసిన కుర్రాడికి హీరోగా విజయ్ కనిపిస్తాడు.
 
ఓ షిప్ లో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ విజయ్ కనపడతాడు. ఈ యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ తరహాలో, హై క్వాలిటీ విజువల్, టెక్నికల్ ఎఫెక్ట్స్ తో... ఒక భారీ బడ్జెట్ సినిమాకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఉన్నాయి. చివరకు థియేటర్ లో కూల్ డ్రింక్ అమ్ముకునే కుర్రాడితో విజయ్ మాట్లాడుతూ.. 'సాఫ్ట్ డ్రింక్ కాదు తమ్ముడూ... తూఫాన్' (Soft Drink Kaadu, idi Toofan) అంటూ విజయ్ థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోతుండగా యాడ్ ముగుస్తుంది. ఈ యాడ్ ను మీరు కూడా చూడండి.


Vijay Devarakonda
Tollywood
Thums Up
AD

More Telugu News