Mekathoti Sucharitha: నారా లోకేశ్ పీఏ మహిళలను వేధిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి: ఏపీ హోంమంత్రి సుచరిత

There are allegations that Nara Lokesh torturing women says Sucharitha
  • నేరం చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం
  • గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో 46 మందిని అరెస్ట్ చేశాం
  • ఎలాంటి వారినైనా విచారించే అధికారాన్ని పోలీసులకు ఇచ్చాం
నేరం చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఏ ఒక్కరినీ వదలే ప్రసక్తే లేదని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. రాష్ట్రంలో నేరాలు జరగడం లేదని తాము చెప్పడం లేదని... అయితే నేరస్తుల పట్ల తమ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో చూడాలని చెప్పారు. మహిళలు, బాలికలపై చేయి వేస్తే తమ ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు.

గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో ఇప్పటి వరకు 46 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. విజయవాడ టీడీపీ నేత వినోద్ జైన్ పై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. నారా లోకేశ్ పీఏ మహిళలను వేధిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయని చెప్పారు. ఎలాంటి వారినైనా విచారించే అధికారాన్ని పోలీసులకు ఇచ్చామని తెలిపారు. దిశ యాప్ ను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 
Mekathoti Sucharitha
YSRCP
Nara Lokesh
Telugudesam

More Telugu News