Rahul Gandhi: చాలా మంది భారతీయులు మహిళలను మనుషులుగా చూడడం లేదు: రాహుల్ గాంధీ

Many Indians Do not Consider Women is Human
  • సమాజం సిగ్గుపడే ఘటన
  • సమాజ వికృత రూపానికి నిదర్శనమని వ్యాఖ్య
  • ఢిల్లీలో యువతిపై దాడి పట్ల రాహుల్ విచారం
ఢిల్లీలో 20 ఏళ్ల యువతిపై మూకదాడి పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. సమాజం సిగ్గుపడే ఘటనగా దీనిని పేర్కొన్నారు. అత్యాచార బాధితురాలైన సదరు యువతిని స్థానిక యువకులు చుట్టుముట్టి కొడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సంచలనానికి దారి తీసింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు.

‘‘20 ఏళ్ల మహిళపై దారుణంగా దాడి చేసిన వీడియో కలవరానికి గురిచేసే మన సమాజపు ముఖాన్ని తెలియజేస్తోంది. చేదు నిజం ఏమిటంటే.. చాలా మంది భారతీయులు మహిళలను మనుషులుగా చూడకపోవడం. సిగ్గుచేటైన ఈ నిజాన్ని గుర్తించాల్సి ఉంది. దాన్ని పారదోలాల్సి ఉంది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

మరోపక్క, ఈ వీడియో వెలుగు చూసిన తర్వాత ఢిల్లీ పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ నిర్వహిస్తున్నామని, సామాజిక మాధ్యమాల్లో వదంతులను వ్యాప్తి చేయవద్దని కోరారు. బాధితురాలు ఆరోగ్యంగానే ఉందని తెలిపారు.
Rahul Gandhi
reaction
delhi incident
women beaten

More Telugu News