Ram Nath Kovind: పద్మాలను సామాన్యుల వరకు తీసుకెళ్లాం.. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో రాష్ట్రపతి ప్రసంగం.. హైలైట్స్-1!

President Ram Nath Kovind speech in parliament
  • కరోనాపై పోరాటంలో భారత్ స్ఫూర్తి అద్భుతం
  • వ్యాక్సినేషన్ లో యావత్ ప్రపంచానికే భారత్ ఆదర్శం
  • ఎవరూ ఆకలితో ఉండకూడదనేదే నా ప్రభుత్వ లక్ష్యం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటుకు విచ్చేసిన భారత రాష్ట్రపతికి ప్రధాని మోదీ, ఉభయసభల అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా తొలుత ఆయన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని హైలైట్స్ ఇవే:
  • కరోనాపై పోరాటంలో భారత్ స్ఫూర్తి అత్యద్భుతం.
  • వ్యాక్సినేషన్ వల్ల కరోనాను కట్టడి చేస్తున్నాం. కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలసికట్టుగా మహమ్మారిపై పోరాడుతున్నాయి.
  • వ్యాక్సినేషన్ లో యావత్ ప్రపంచానికే భారత్ ఆదర్శం.
  • ఇప్పుడు 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేస్తున్నాం.
  • వ్యాక్సినేషన్ కార్యక్రమం శర వేగంగా సాగుతోంది. ఏడాది కాలంలో 15 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశాం.
  • భారత్ లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది.
  • ఇప్పటి వరకు 8 వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగ అనుమతి ఉంది.
  • ఫార్మా రంగాన్ని విస్తరించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది.
  • కరోనా కట్టడిలో ఫ్రంట్ లైన్ వారియర్లకు హ్యాట్సాఫ్.
  • సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ లక్ష్యంతో నా ప్రభుత్వం పని చేస్తోంది.
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంతో గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయి.
  • దేశంలో 80 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే.
  • రైతులకు అధిక మద్దతు ధర ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
  • జల్ జీవన్ మిషన్ తో గ్రామాలకు తాగునీరు అందుతోంది.
  • పద్మ పురస్కారాలను సామాన్యుల వరకు తీసుకెళ్లాం.
  • గ్రామీణ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రుణాలను పెంచుతున్నాం.
  • ప్రపంచంలో అతిపెద్ద ఆహార ఉత్పత్తి, సరఫరా వ్యవస్థ భారతే.
  • దేశంలో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదనేదే నా ప్రభుత్వ లక్ష్యం.
  • 8 వేలకు పైగా జన్ ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకే ఔషధాలను తయారు చేస్తున్నాం.
  • ఈ-శ్రమ పోర్టల్ ద్వారా 23 కోట్ల మంది కార్మికులు కనెక్ట్ అయి ఉన్నారు.
Ram Nath Kovind
President Of India
Parliament
Budget Session

More Telugu News